టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా చిల్లర దొంగలు.. జేబు దొంగలు అని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా చిల్లర దొంగలు.. జేబు దొంగలు అని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చినా ఇప్పటికీ వారు ఆ హోదాలో కొనసాగడం సిగ్గుచేటన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘కోర్టు ఉత్తర్వులు నాకు అందలేదని, అందుకే ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తప్పించుకునే ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో కోర్టు ఉత్తర్వులు తీసుకుని సచివాలయానికి వచ్చాను.
ఆయన లేకపోవడంతో రాజీవ్‌శర్మ ఓఎస్‌డీకి ఇచ్చా’ అని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. హరీశ్‌రావు ఏదో ఒక రోజు పార్టీని చీల్చడం ఖాయమన్నారు.