
శాసనసభలో ఏకపాత్రాభినయం
ప్రతిపక్షాలదే కాకుండా మంత్రుల గొంతునొక్కి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులే శాసనసభలో ఏకపాత్రాభినయం చేశారని టీటీడీఎల్పీనేత రేవంత్‌రెడ్డి విమర్శించారు.
సీఎం కేసీఆర్‌పై మండిపడ్డ రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలదే కాకుండా మంత్రుల గొంతునొక్కి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులే శాసనసభలో ఏకపాత్రాభినయం చేశారని టీటీడీఎల్పీనేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆయన మాట్లాడారు. సమావేశాల్లో కేబినెట్ మంత్రులను తోలుబొమ్మలుగా మార్చారని ఆరోపించారు. శాసనసభ శీతాకాల సమావేశాలు 94 గంటలు జరిగితే 54 గంటలు ప్రభుత్వమే మాట్లాడిందన్నారు.
30 గంటలపాటు కేవలం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే మాట్లాడారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను, మంత్రులనే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూడా కేసీఆర్ అవమానించారని వ్యాఖ్యానించారు. భూసేకరణపై రెవెన్యూ మంత్రి మహమూద్ అలీకి బదులు నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, మైనార్టీలపై సీఎం కేసీఆర్ మాట్లాడి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని అవమానపర్చారని విమర్శించారు.