ఆదివాసీ తెగల నుంచి లంబాడాలను తొలగించాలి   

Remove Lambadis From Tribal Communities - Sakshi

నిర్మల్‌అర్బన్‌ : ఆదివాసీ తెగల నుంచి లంబాడాలను తొలగించాలని తుడుందెబ్బ నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్స వాన్ని తుడుందెబ్బ ఆధ్వర్యంలో జిల్లా  కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట గల కుమురంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనం తరం అక్కడి నుంచి వైఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ వర కు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో గుస్సాడి నృ త్యాలు అలరించాయి. అనంతరం నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడా రు.

జిల్లా కేంద్రంలో ఆదివాసీ భవనం కోసం స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయాల ని డిమాండ్‌ చేశారు. ఆదివాసీలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. 60 శాతం ఆదివాసీలు నివసిస్తున్న నాన్‌ షెడ్యూల్డు ప్రాంతాలను షెడ్యూల్డు ప్రాంతాలుగా గుర్తించా లని కోరారు. ఆదివాసీలకు స్వయం పాలన కల్పి స్తూ ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో మినీ ఐటీడీఏ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

బ్యాంకులతో సం బంధం లేకుండా అర్హులైన ఎస్టీలకు సబ్సిడీ రుణా లు ఇవ్వాలని, ఆదివాసీ విద్యార్థులకు జిల్లా కేం ద్రంలో స్టడీసెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీటీడీవో శ్రీనివాస్‌రెడ్డిని సన్మానించారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు భూమేశ్, నాయక్‌పోడ్‌ జిల్లా అధ్యక్షుడు మొసలి చిన్నయ్య, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సకెందర్, ఆదివాసీ రాంజీ గోండు జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌రావ్, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె. భీమేష్, తదితరులున్నారు.

ఆదివాసీ దినోత్సవాన్నిఅధికారికంగా జరపాలి 

ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదివాసీ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో గురువారం సంఘం ఆధ్వర్యంలో ‘ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని’ జరుపుకున్నారు. ఈ సందర్భంగా కుమురం భీం, రాంజీగోండ్‌ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలతో ప్రదర్శన నిర్వహించారు. చైన్‌గేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆదివాసీలకు డబుల్‌ బెడ్‌రూం, మూడెకరాల సాగు భూమి, సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా డోల్, తుడుంపేప్రె, గుస్సాడి డేంసా తదితర పాటలపై ఆదివాసీలు చేసిన నృత్యాలు అలరించాయి. ఇందులో నాయకులు నైతం భీంరావు, సోయం సూర్యబావ్, ఉయిక భీంరావు, బుర్కె విశ్వనాథ్, సుదర్శన్, జంగు, నాగోరావు, సుంగన్న, గణపతి,తదితరులున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top