సింగరేణిలో కొలువుల జాతర.. | Recruitment in Singareni the first notification | Sakshi
Sakshi News home page

సింగరేణిలో కొలువుల జాతర..

Feb 11 2015 12:41 AM | Updated on Sep 2 2018 4:16 PM

సింగరేణిలో కొలువుల జాతర మొదలైంది. ముందుగా ప్రకటించిన విధంగా మంగళవారం తొలి నోటిఫికేషన్ విడుదల ....

1,222 పోస్టుల భర్తీకి తొలి నోటిఫికేషన్
నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. 25 వరకు గడువు

 
 కొత్తగూడెం: సింగరేణిలో కొలువుల జాతర మొదలైంది. ముందుగా ప్రకటించిన విధంగా మంగళవారం తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్, ఎన్‌సీడబ్ల్యూఏ కేటగిరీలకు చెందిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 1,222 పోస్టులకు ఎక్స్‌టర్నల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. 8 విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయనుండగా గరిష్టంగా జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ (జేఎంఈటీ) విభాగంలో 811 పోస్టులు, కనిష్టంగా మేనేజ్‌మెంట్ ట్రైనీ సివిల్ విభాగంలో 10 పోస్టులు ఉన్నాయి. 11వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభించి ఈనెల 25 వరకు స్వీకరించనున్నారు. అనంతరం ప్రింటెడ్ అప్లికేషన్స్, జిరాక్స్ కాపీలతో మార్చి 4 వరకు నోటిఫికేషన్‌లో పొందుపరిచిన అడ్రస్‌కు పంపిం చాల్సి ఉంటుంది. పోస్టులకు సంబంధించి అభ్యర్థుల అర్హతలు, వయసు, పోస్టుల రిజర్వేషన్ తదితర వివరాలను నోటిఫికేషన్‌లో పొందుపరిచింది. యాజమాన్యం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం కేటగిరీలు, పోస్టుల వివరాలిలా ఉన్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement