
సాక్షి, హైదరాబాద్: ఖరగ్‌పూర్ డివిజన్‌లో నిరసనల నేపథ్యంలో రైల్వే శాఖ పలురైళ్లను రద్దు చేసింది. హౌరా–సికింద్రాబాద్, హౌరా–కన్యాకుమారి, సంత్రాగచ్చి–పాండిచ్చేరి, అగర్తల–బెంగళూరు, గువాహటి–బెంగళూరు, గువాహటి–సికింద్రాబాద్, యశ్వంత్‌పూర్–హౌరా, మైసూరు–హౌరా, పూరి–చెన్నై రైళ్లను రద్దు చేసింది.
దక్షిణ మధ్యరైల్వేకు జాతీయ ఇంధన పొదుపు అవార్డులు
ఇంధన పొదుపు విషయంలో దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. సౌర విద్యుత్ వినియోగం, ఆక్యుపెన్సీ, సెన్సార్ల వినియోగం, ఎల్‌ఈడీ బల్బుల వినియోగం, ఇంధన సామర్థ్యాన్ని పెంచే పంపుల వినియోగం వంటి అంశాల్లో చేపట్టిన చర్యలకు గాను ఈ అవార్డులు లభించాయి. ఈ నెల 14న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎ.ఎ.ఫడ్కే, హైదరాబాద్ డివిజన్ ఇంజనీర్ డీఆర్‌ఎం ఎస్‌ఎస్‌ఆర్ ప్రసాద్‌లు అందుకున్నారు.