రెండేళ్లలో నిజామాబాద్‌కు విద్యుత్‌ రైలు

Railway Authorities Approve the Electrification of Nizamabad Railway Line - Sakshi

సికింద్రాబాద్‌ మన్మాడ్‌ మధ్య విద్యుదీకరణ పనులకు పచ్చజెండా

నిజామాబాద్‌ సిటీ(నిజామాబాద్‌అర్బన్‌): రాను న్న రెండేళ్లలోపు జిల్లా మీదుగా విద్యుత్‌ రైళ్లు నడువనున్నాయి. ఈ మేరకు రైల్వే ఉన్నాతాధికారులు సికింద్రాబాద్, మన్మాడ్‌ వయా నిజామాబాద్‌ మీదుగా విద్యుదీకరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే జోనల్‌ కమిటీ సభ్యుడి జి.మనోహర్‌రెడ్డి తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలో మనోహర్‌రెడ్డి రైల్వే ఉన్నాతాధికారులను కలిసి నిజామాబాద్‌ మీదుగా విద్యుత్‌ లైన్, కొత్త రైళ్లు నడపాలని చేసిన విజ్ఞప్తికి అధికారులు స్పందించినట్లు ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్‌ మన్మాడ్‌ల మధ్య డబ్లింగ్‌ పనులు ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుండి మేడ్చల్‌ పూర్తయ్యాయన్నారు. మేడ్చల్‌ ముత్కేడ్‌ల మధ్య డబ్లింగ్‌ పనులకు గత ఏడాది రైల్వేశాఖ రూ.713 కోట్లు మంజూరు చేయగా పనులు మొదలైనట్లు తెలిపారు. అలాగే సికింద్రాబాద్‌ మన్మాడ్‌ల మధ్య విద్యుదీకరణ పనులు పూర్తిచేస్తే నిజామాబాద్‌ జిల్లా వ్యాపార పరంగా మరింత అభివృద్ది చెందటంతో పాటు, రైళ్ల వేగం పెరుగుతుందన్నారు. అలాగే పెద్దపల్లి కరీంనగర్, నిజామాబాద్‌ రైలు మార్గం విద్యుదీకరణ పనులు కూడా రానున్న రెండేళ్లలోపు పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చిన ట్లు మనోహర్‌రెడ్డి తెలిపారు.ఇటీవల పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్‌లో అకోలా ఖాండ్వా రైలు లైన్‌కు మోక్షం లభించటంతో జిల్లా నుండి నేరుగా న్యూఢిల్లీకి ప్రయాణించే సదుపాయం కలిగిందన్నారు. సికింద్రాబాద్‌ నుండి న్యూఢిల్లీ వ యా నిజామాబాద్, నాందేడ్, అకోలా, ఖాండ్వాల మీదుగా సరస్వతి ఎక్స్‌ప్రెస్‌ పేరుతో రైలు నడుపటం ద్వారా 160 కిలోమీటర్ల దూరం తగ్గటంతో పాటు 4 గంటలు ఆదా అవుతుందన్నా రు. అకోలా ఖాండ్వా రైలు మార్గం రెండేళ్లలోపు పూర్తి చేస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top