నేడు రాహుల్ గాంధీ పాదయాత్ర | rahul gandhi padayatra today | Sakshi
Sakshi News home page

నేడు రాహుల్ గాంధీ పాదయాత్ర

May 15 2015 8:10 AM | Updated on Jun 4 2019 5:04 PM

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నారు.

ఆదిలాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ రోజు ఉదయం మామడ మండలం కొరిటికల్ నుంచి ప్రారంభించి లక్ష్మణచాంద మండలం వడ్యాల్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర ఆయన నడవనున్నారు. కొరటికల్, లక్ష్మణచాంద, పొట్టుపల్లి, రాచాపూర్, వడ్యాల్ గ్రామాల్లో రాహుల్ యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా బాధిత రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. స్థానిక రైతులతో మాట్లాడతారు..అనంతరం వడ్యాల్లో మూడు గంటలకు రైతు సదస్సు ఉంటుంది.

 

దీనిలో భాగంగా రైతు కుటుంబాలకు రూ.లక్ష ఆర్థికసాయం చేసే అవకాశం ఉంది. రాహుల్ పర్యటన నేపథ్యంలో ముఖ్య నేతలంతా ముందుగానే నిర్మల్‌కు చేరుకుని రోజంతా ఏర్పాట్లను పరిశీలించారు. రాహుల్ వెంట అసోం సీఎం కుమారుడు గౌరవ్ గొగొయ్, ఎంపీలు సుస్మిత, రాజ్ గబ్బర్ లు ఉన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement