వైద్యుల నిర్లక్ష్యం వల్లే రాజనర్సయ్య మృతిచెందాడని ఆయన బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాయి.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే రాజనర్సయ్య మృతిచెందాడని ఆయన బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాయి. ఇంజక్షన్ వికటించడంతోనే ఇలా జరిగిందని.. ఆయన మృతికి వైద్యులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. క రీంనగర్ పట్టణానికి చెందిన రాజనర్సయ్య(55) గత కొన్ని రోజులుగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. దీంతో మూడు రోజుల క్రితం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు.
ఈక్రమంలో మంగళవారం రాత్రి వైద్య సిబ్బంది ఆయనకు ఇంజక్షన్ చేశారు. బుధవారం ఉదయానికి ఆయన మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు వైద్యం వికటించడంతోనే ఆయన మృతిచెందాడని ఆస్పత్రి వర్గాలతో వాగ్వాదానికి దిగి తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ధర్నా చేస్తామని నిరిసనకు దిగాయి.