breaking news
rajanarsaiah
-
రాసలీలల్లో ఉండి రెడ్ హ్యాండెడ్‌గా బుక్కు
జనగామ: అతడు బాధ్యతగల ఉద్యోగి. పైగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్యాపిల్లలు ఉన్నారు. కానీ, అతడు వక్రబుద్దితో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఫలితంగా పచ్చని సంసారంలో సమస్యలు మొదలయ్యాయి. తాను ఎలాంటి తప్పు చేయడం లేదంటూ బుకాయిస్తూ వస్తున్న అతడి ఆట ఎట్టకేలకు ఆటకట్టయింది. రెడ్ హ్యాండెడ్‌గా అతడిని బంధువులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. రాజనర్సయ్య అనే వ్యక్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అతడి భార్యాపిల్లలు ఉండగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై ఇన్ని రోజులపాటు బుకాయిస్తూ వస్తున్న అతడు పరాయి మహిళతో రాసలీలల్లో ఉండగా ఆయన బంధువులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
కరీంనగర్ జిల్లా ఆస్పత్రి ఎదుట ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యం వల్లే రాజనర్సయ్య మృతిచెందాడని ఆయన బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాయి. ఇంజక్షన్ వికటించడంతోనే ఇలా జరిగిందని.. ఆయన మృతికి వైద్యులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. క రీంనగర్ పట్టణానికి చెందిన రాజనర్సయ్య(55) గత కొన్ని రోజులుగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. దీంతో మూడు రోజుల క్రితం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి వైద్య సిబ్బంది ఆయనకు ఇంజక్షన్ చేశారు. బుధవారం ఉదయానికి ఆయన మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు వైద్యం వికటించడంతోనే ఆయన మృతిచెందాడని ఆస్పత్రి వర్గాలతో వాగ్వాదానికి దిగి తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ధర్నా చేస్తామని నిరిసనకు దిగాయి.