టీ విత్‌ ప్రిన్సిపాల్‌ | Program every Saturday with parents of BC students | Sakshi
Sakshi News home page

టీ విత్‌ ప్రిన్సిపాల్‌

Sep 14 2019 5:17 AM | Updated on Sep 14 2019 5:17 AM

Program every Saturday with parents of BC students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పిల్లల సమస్యల పరిష్కారం, బోధన, అభ్యసన కార్యక్రమాల్లో కొత్త ఆలోచనలకు అవకాశం కలి్పంచేందుకు బీసీ గురుకుల సొసైటీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల తల్లిదండ్రులతో ‘టీ విత్‌ ప్రిన్సిపాల్‌’ కార్యక్రమాన్ని తీసుకొచి్చంది. ప్రతి శనివారం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొంటారు. వారితో చర్చించి పాఠశాల అభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తారు. సాధారణంగా పాఠశాలలో విద్యార్థికి ఎదురయ్యే పరిస్థితులను టీచర్ల వద్ద కంటే తల్లిదండ్రుల వద్ద ప్రస్తావిస్తారు. అలాంటి అంశాలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకే బీసీ గురుకుల సొసైటీ ఈ కార్యక్రమాన్ని పరిచయం చేసింది. ఇందులో విద్యార్థుల సమస్యలతోపాటు బోధన, అభ్యసన కార్య క్రమాల అమలుపై సలహాలు సూచనలు సైతం తీసుకుంటారు. అలా నమో దు చేసిన సూచనలతో సరికొత్తగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంతో పాటు గురుకుల సొసైటీకి సమావేశ పురోగతిని సమరి్పంచాల్సి ఉంటుంది.

మరింత దగ్గరయ్యేలా...
తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 23 బీసీ గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2017–18 విద్యా సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఒకేసారి 119 గురుకుల పాఠశాలలను తెరిచారు. క్షేత్రస్థాయిలో డిమాండ్‌ అధికంగా ఉండడంతో 2019–20 విద్యా సంవత్సరంలో అదనంగా మరో 119 గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోని అతి పెద్ద గురుకుల సొసైటీగా మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆవిర్భవించింది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యల పరిష్కారం, తల్లిదండ్రులతో గురుకుల బృందం దగ్గరయ్యేందుకు  సొసైటీ ఈకార్యక్రమాన్ని తీసుకొచి్చంది. ప్రతి శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో కనీసం 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తారు.

ఈ అంశాలపై చర్చ...
టీ విత్‌ ప్రిన్సిపాల్‌ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌తో పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇందులో విద్యార్థి తాలూకు పురోగతి, బోధన అభ్యసన కార్యక్రమాలపై చర్చిస్తారు. పాఠశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి కోసం దాతల సహకారం, వసతుల కల్పనపైనా మాట్లాడతారు. పాఠశాల ప్రగతి నివేదికలు సైతం ఇందులో వివరిస్తారు. పాఠశాల ఆవరణలో పచ్చదనం, స్థానిక యువత సహకారంపై సలహాలు, సూచనలు తీసుకుంటారు. విద్యార్థుల తల్లిదండ్రుల వ్యక్తిగత నైపుణ్యాన్ని తెలుసుకుని పాఠశాల కార్యక్రమాల్లో వారి సహకారాన్ని తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement