నగదు చెల్లిస్తేనే..

Private Hospitals Clarify on Coronavirus Fees Hyderabad - Sakshi

కరోనా చికిత్సపై ప్రైవేటు ఆస్పత్రుల స్పష్టీకరణ

ప్రభుత్వ ఫీజులను అందరికీ అమలు చేయలేం

మీడియాకు చర్చల వివరాలు తెలిపిన ‘కిమ్స్‌’ అధినేత

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు కేవలం నగదు చెల్లించే కొన్ని వర్గాలకు మాత్రమేనని, ఆ మేరకు ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఉ  త్తర్వుల్లో మార్పులు చేయాలని తెలంగాణ ప్రైవేట్‌ సూపర్‌ స్పెషాలిటీస్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ అధ్యక్షుడు, కిమ్స్‌ ఆస్పత్రుల అధినేత భాస్కర్‌రావు స్పష్టం చేశారు. దీనిపై  సీఎస్‌ సోమేశ్‌ కుమార్, మంత్రి ఈటల రాజేందర్‌తో జరిగిన చర్చల వివరాలను ఆయన మీడియాకు వివరించారు.

ఆ ఫీజులు పేదలకంటేనే ఒప్పుకున్నాం...
‘సర్కారు జీవో ప్రకారమే కరోనా చికిత్సకు ఫీజులు వసూలు చేయాలని, ఆ ప్రకారమే చెల్లిస్తామని బీమా కంపెనీలు ఒత్తి డి చేస్తున్నాయి. అందరికీ అలా చేయాలంటే కుదరదని ప్ర భుత్వానికి విన్నవించాం. ప్రభుత్వం ప్రకటించిన ఫీజుల ప్ర కారం అందరికీ కరోనా వైద్యం కుదరదు. కేవలం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, పేదలకు ఆ ఫీజులకు చికిత్స అందించాలంటేనే ఒప్పుకున్నాం. కర్ణాటక, మహారాష్ట్రలలో విడుదల చేసిన జీవోల్లో కూడా కేవలం నగదు చెల్లించే రోగులకే ఆయా రాష్ట్రాలు ఫిక్స్‌ చేసిన ఫీజులను వసూలు చేయాలని జీవోల్లో ఉంది. ప్రైవేటు బీమా, సీజీహెచ్‌ఎస్‌ వంటి రోగులకు సర్కారు ఉత్తర్వులు వర్తించవు. అది కూడా సాధారణ వార్డుల్లో ఉన్న వారికే ఇది వర్తి స్తుంది. అందరికీ ఆ ఫీజు లతో వైద్యం చేయడం సాధ్యం కాదని చెప్పామని తెలిపారు.

ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి...
నగదు చెల్లించే వారికి మాత్రమే ఆ ఫీజులు వర్తిస్తాయని ప్ర భుత్వం ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వాలని కోరినట్లు భాస్కర్‌రావు చెప్పారు. అందరికీ అవే ఫీజులతో చికిత్స చేస్తే ఆసుపత్రులు నిలదొక్కుకోలేవన్నారు. 50 శాతం పడకలు ప్రభుత్వానికి ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. కరోనా చికిత్సకు  బెడ్‌ల కేటాయింపును యాప్‌ ద్వారా చేస్తారని, ఐఏఎస్‌లతో కమిటీ వేస్తారంటూ వచ్చిన ప్రచారమూ తమ కు తెలియదన్నారు. పడకలు లేవంటూ చెప్పడం, ఎవరో ఒ కరు రావడం వంటివి జరుగుతున్నాయి కాబట్టి ఒక నోడల్‌ ఆఫీసర్‌ను పెట్టాలని మాత్రం ప్రభుత్వాన్ని కోరామన్నారు. వాస్తవానికి ప్రభుత్వం కూడా ఉత్తర్వుల జారీకి ముందు జనరల్‌ వార్డుల్లో ఉన్న వారికే నిర్దేశించిన ఫీజులన్న విషయాన్ని అంగీకరించిందన్నారు. బీమా కంపెనీలకు ఈ ప్యాకేజీ వర్తిం చదని జీవోలో మార్పులు చేయాలని కోరామన్నారు. ఇప్పటికే వివిధ జబ్బులకు వర్తించేలా బీమా కంపెనీలు ప్రజల నుంచి పాలసీలు తీసుకున్నాయని, వాటి ప్రకారం ఫీజులు వసూలు చేస్తాం తప్ప ఈ ప్యాకేజీ ప్రకారం కరోనా రోగుల కు ఫీజులను వర్తింప చేయలేమన్నారు. ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు ప్రభుత్వ ప్యాకేజీ కిందకు రారని స్పష్టం చేశారు. వారంతా డబ్బులు చెల్లించాల్సిందేనన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

23-09-2020
Sep 23, 2020, 03:58 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోజూ నమోదవుతున్న కోవిడ్‌ కేసుల కంటే డిశ్చార్జ్‌ అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24...
23-09-2020
Sep 23, 2020, 03:53 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వాల్సిన ఆక్సిజన్‌ను సమకూర్చుకోవడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో నిలిచింది. రాష్ట్రంలో అవసరమైనదాని...
22-09-2020
Sep 22, 2020, 21:26 IST
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలిన డ్రాగన్‌ దేశంపై...
22-09-2020
Sep 22, 2020, 20:15 IST
ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,62,376. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 71,465.
22-09-2020
Sep 22, 2020, 19:26 IST
జరగాల్సిన నష్టం జరిగి పోయాక రాత్రి పది గంటల నుంచి ఆంక్షలు విధించడం వల్ల కలిగే ప్రయోజనం ఏముంటుంది?
22-09-2020
Sep 22, 2020, 17:56 IST
అందుకనే ఇంకా విటమిన్లు, పోషక పదార్థాల కోసం ఇతర మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది.
22-09-2020
Sep 22, 2020, 16:36 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య భారత్‌లో గణనీయంగా పడిపోతోంది. సెప్టెంబర్‌...
22-09-2020
Sep 22, 2020, 15:53 IST
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లో సైతం రోజురోజుకు అత్యంతగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 90 వేల మందికి...
22-09-2020
Sep 22, 2020, 14:13 IST
ముంబై: బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. మహమ్మారి కరోనా కాటుకు సీనియర్‌ నటి, ప్రముఖ థియేటర్‌ ఆర్టిస్టు ఆశాలత వాగోంకర్‌(79) బలైపోయారు....
22-09-2020
Sep 22, 2020, 14:07 IST
బీజింగ్ : ప్రభుత్వంపై విమర్శలకు చేసినందుకు గాను చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిలియనీర్ రెన్ జికియాంగ్ (69) కు...
22-09-2020
Sep 22, 2020, 10:36 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇక గడచిన 24...
22-09-2020
Sep 22, 2020, 09:05 IST
అమలాపురం టౌన్‌ : ఇప్పటి వరకూ కరోనాతో ఎవరైనా మరణిస్తే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు రూ.వేలల్లో డిమాండ్‌ చేసిన...
22-09-2020
Sep 22, 2020, 04:14 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 24 గంటల్లో 10, 502 మంది...
22-09-2020
Sep 22, 2020, 03:55 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్, జూలై నెలల్లో ఓ మోస్తరుగా నమోదైన...
21-09-2020
Sep 21, 2020, 20:07 IST
సాక్షి, విజయవాడ : కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో జిల్లాలో కొత్త‌గా 10 కంటైన్‌మెంట్ జోన్ల‌ను క‌లెక్ట‌ర్ ఇంతియాజ్ ప్ర‌క‌టించారు. ఎ.కొండూరు...
21-09-2020
Sep 21, 2020, 19:44 IST
పది రోజుల్లో పది వేల పడకల ఆస్పత్రిని నిర్మించి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన చైనా, ఇప్పుడు అంతకంటే ఆశ్చర్యపరిచే మహత్కార్యానికి...
21-09-2020
Sep 21, 2020, 19:08 IST
గుర్రు పెడుతూ నిద్రపోయే వారిలో కండరాలు విశ్రాంతి తీసుకున్నప్పుడు కొన్ని క్షణాలపాటు తాత్కాలికంగా శ్వాసనాళంలోకి గాలి సరిగ్గా పోదని, ఫలితంగా...
21-09-2020
Sep 21, 2020, 17:27 IST
త 24 గంటల్లో 10,502 మంది కోవిడ్‌ రోగులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,51,821 మంది వైరస్‌ను జయించారు.
21-09-2020
Sep 21, 2020, 16:48 IST
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యం ఖర్చులను క్రమబద్దీకరించేందుకు దేశంలోని దాదాపు 15 రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగినప్పటికీ ముక్కుకు తాడేయలేక...
21-09-2020
Sep 21, 2020, 15:04 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభంలో వందే భారత్ మిషన్ పథకం కింద విదేశీయులను చేరవేస్తున్న ఎయిరిండియాకు మరోసారి ఊహించని షాక్ తగిలింది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top