8 నెలల గర్భిణీ వైద్యం సకాలంలో అందక మృత్యువాతపడింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలో జరిగింది.
మాచారెడ్డి (నిజామాబాద్) : 8 నెలల గర్భిణి వైద్యం సకాలంలో అందక మృత్యువాతపడింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలో జరిగింది. మండలంలోని ఇస్సాయిపేటకు చెందిన శివరాజ్, లక్ష్మి(28) నిరుపేద దంపతులు. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేక లక్ష్మి గర్భం దాల్చిన నాటి నుంచి కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చూపించుకుంటోంది.
ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భవతి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అస్వస్థతకు గురైన లక్ష్మిని కుటుంబసభ్యులు కామారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించటంతో నిజామాబాద్ సర్కారు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు హైదరాబాద్‌కు రెఫర్ చేయటంతో తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె కన్నుమూసింది.