పోలింగ్‌కు..యంత్రాలు సిద్ధం

Polling Machines Are Ready For Telangana Elections In Nalgonda - Sakshi

మొదటి విడత పూర్తయిన ఈవీఎంల ర్యాండమైజేషన్‌ 

రెండో విడత నియోజకవర్గాల్లో, మూడో విడత డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లలో నిర్వహణ

ఆ తర్వాతే పోలింగ్‌ బూత్‌లకు ఓటింగ్‌ యంత్రాలు

అదనంగా 18శాతం యంత్రాల కేటాయింపు, అత్యవసర పరిస్థితుల్లో వీటి వినియోగం 

సాక్షి,నల్లగొండ : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు ఓటింగ్‌ యంత్రాల ర్యాండమైజేషన్‌ (మిక్సింగ్‌) మొదటి విడత పూర్తి చేశారు. పోలింగ్‌లో ఉపయోగించే బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లకు మూడు విడతల్లో ర్యాండమైజేషన్‌ చేయాల్సి ఉంది. బెల్‌ కంపెనీకి సంబంధించిన ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్లను  గోదాముల్లోనే ఉంచి రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలించారు. అనంతరం గట్టి బం దోబస్తుతో భద్రపర్చారు. ఆ యంత్రాలకు సం బంధించి ఆన్‌లైన్‌లో నంబర్లను అన్నింటినీ ర్యాం డమైజేషన్‌  చేశారు. ఆ విధంగానే ఓ బాక్స్‌లోని 10 యంత్రాలను మార్చివేరే బాక్స్‌లలోకి మార్చారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా యంత్రాలను సిద్ధం చేసి పెట్టారు. ఒక్కో బాక్సులో 10 ఓటింగ్‌యంత్రాలు ఉంటాయి. అందులో ఏ నియోజకవర్గానికి సంబంధించిన యంత్రం ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు.

ఆ విధంగా మొదటి విడత ర్యాండమైజేషన్‌ చేశారు. ఆయా బాక్సుల్లో ఉన్నవాటన్నింటినీ బార్‌కోడ్‌ ఆధారంగా ఆయా నియోజకవర్గాలకు కేటాయిస్తారు. అనంతరం వాటిని నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరుస్తారు. అక్కడ రెండో విడత ర్యాండమైజేషన్‌ జరుగుతుంది. ఆ సందర్భంలో ఏయే యంత్రం ఎక్కడ వెళ్తుందో కూడా ఎన్నికల సిబ్బందికి తెలిసే అవకాశం లేదు. ఆ విధంగా అధికారులు ఆన్‌లైన్‌లో యంత్రాల బార్‌ కోడ్‌ఆధారంగా రాజకీయ పక్షాల ముందే మిక్సింగ్‌ చేస్తారు. ఆ తర్వాత తిరిగి పోలింగ్‌ముందు రోజు డ్రిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ర్యాండమైజేషన్‌ చేసి ఏ పోలింగ్‌ బూత్‌కు ఏ ఈవీఎం, బ్యాలెట్‌ యూనిట్, కంట్రోల్‌ యూనిట్, వీవీ ప్యాట్‌ వెళ్లాల్సి ఉందో ఆ విధంగా ఆయా పోలింగ్‌బూత్‌లకు కేటాయించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్, పోలింగ్‌ అధికారులకు అందిస్తారు. అక్కడినుంచి నేరుగా ఎన్నికల విధులలో భాగంగా పోలింగ్‌ స్టేషన్లకు తీసుకెళ్తారు. అప్పటివరకు కూడా ఏ యంత్రం ఎటు వెళ్తుందో కూడా తెలియనివ్వరు.

నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ యంత్రాల కేటాయింపు :

 దేవరకొండ    338
నాగార్జునసాగర్‌  329
మిర్యాలగూడ    288 
మునుగోడు    318 
నకికరేకల్‌ 337
నల్లగొండ    316   

18శాతం అదనంగా యంత్రాలు.. 
ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న పోలింగ్‌బూత్‌లను బట్టి అదనంగా ప్రతి నియోజకవర్గానికి 18 శాతం యంత్రాలను అందిస్తున్నారు. అదనంగా తీసుకున్న వాటిని నియోజకవర్గ కేంద్రంలోని రిటర్నింగ్‌ కార్యాలయంలో ఉంచుతారు. పోలింగ్‌ సమయంలో ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తి ఓటింగ్‌కు అంతరాయం ఏర్పడితే వీటిని ఉపయోగించనున్నారు. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరి«ధిలో అదే విధంగా ఉపయోగిస్తారు. 
నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ బూత్‌లు, యంత్రాలు...
దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి 286 పోలింగ్‌బూత్‌లు ఉండగా 18శాతం అదనంగా కలుపుకుంటే అదనంగా మరో 52 యంత్రాలు ఇవ్వనున్నారు. అంటే ఆ నియోజకవర్గానికి బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌యూనిట్లు, వీవీ ప్యాట్లు 338 అందనున్నాయి. అదే విధంగా నాగార్జున్‌ సాగర్‌ నియోజకవర్గంలో 278 పోలింగ్‌బూత్‌లు ఉండగా 18శాతం కలుపుకుంటే అదనంగా మరో 51 యంత్రాలు ఇవ్వనున్నారు. దీంతో 329 యంత్రాలు సాగర్‌ నియోజకవర్గానికి అందనున్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలో 244 పోలింగ్‌బూత్‌లు ఉండగా అదనంగా 44 యంత్రాలు ఇవ్వనున్నారు. దీంతో 288 యంత్రాలు సాగర్‌ నియోజకవర్గానికి అందనున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో 269 పోలింగ్‌బూత్‌లు ఉండగా 49కలుపుకొని మొత్తం 318 యంత్రాలు కేటాయించారు. నకికరేకల్‌లో నియోజకవర్గంలో 285 పోలింగ్‌బూత్‌లు ఉండగా 337 యంత్రాలు కేటాయించారు. నల్లగొండ నియోజకవర్గానికి సంబం«ధించి 267 పోలింగ్‌ స్టేషన్లకు 316 బ్యాలెట్, కంట్రోల్, వీవీ ప్యాట్లను కేటాయించారు.  

           
    
   
   
           
       

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top