పోలింగ్‌ సామగ్రి వచ్చే..

Poling Machinery And Employees Arrived To the Districts - Sakshi

సాక్షి,మణుగూరురూరల్‌: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణంలో ఈనెల 10న ఎన్నికల సిబ్బందికి కావాల్సిన సామగ్రి పంపిణీకి రంగం సిద్ధం చేసినట్లు ఐటీడీఏ పీఓ, పినపాక నియోజకవర్గ పార్లమెంట్‌ ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి వీపీ.గౌతమ్‌ తెలిపారు. సోమవారం మణుగూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పోలింగ్‌ సామగ్రి పంపిణీ ప్రశాంతంగా నిర్వహించేందుకు 13సెక్టార్లు, 27విభాగాలు ఏర్పాటు చేశామన్నారు. 70మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తారని, ప్రత్యేక డ్యూటీ చేసే ఉద్యోగులు ఉదయం 5గంటలకే ఇక్కడికి చేరుకుంటారని తెలిపారు. సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేందుకు 48ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, 10వ తేదీన పంపిణీ సెంటర్లలో పోలింగ్‌ సిబ్బంది1190, ఇతర కౌంటర్లలో 70మంది ఉద్యోగులు విధులు చేస్తారని తెలిపారు.

వారికి కావాల్సిన భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. 231పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్‌ సామగ్రి పెట్టుకోడానికి 231బ్యాగ్‌లు వారి పోలింగ్‌ కేంద్రాల నంబర్లతో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పోలింగ్‌ స్టేషన్‌లో విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని తెలిపారు. సిబ్బంది, ఉద్యోగులు సకాలంలో హాజరై ఏన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎన్‌టీ.ప్రకాశరావు, ఎస్‌డీసీ బి.వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పరిపాలనా అధికారి సురేష్‌బాబు, ఏపీఓ పవర్‌ అనురాధ, పీఎంఆర్‌సీ రమణయ్య, భావ్‌సింగ్, జేడీఎం హరికృష్ణ పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top