పోలీసుల అత్యుత్సాహం ఇద్దరు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది.
హైదరాబాద్: పోలీసుల అత్యుత్సాహం ఇద్దరు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ కు అడ్డువచ్చారనే కారణంతో ద్విచక్రవాహనాన్ని పొలీసు వాహనంతో గుద్దించారు. ఫలితంగా బైకుపై వెళుతున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
వనస్థలిపురంలోని ఆటోనగర్ లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల అత్యుత్సాహంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనం కోల్పోయి ఇద్దరు యువకులు గాయపడడానికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.