
ఫిబ్రవరి 13న రాష్ట్రానికి ప్రధాని మోదీ!
ప్రధాని మోదీ ఫిబ్రవరి 13న రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. .
ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ఫిబ్రవరి 13న రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. వరంగల్‌లోని గిరిజన విశ్వవిద్యాలయం, కాళోజీ హెల్త్ వర్సిటీ, టెక్స్‌టైల్ పార్క్‌ల శంకుస్థాపన కార్యక్రమాల్లో మోదీ పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదన్నారు. బుధవారం సచివాలయంలో మాట్లాడుతూ..
గతంలో జరిగిన డీఎస్సీల్లో నష్టపోయిన అభ్యర్థులను ఆదుకుంటామని, ఈ విషయంలో న్యాయసలహా తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌లో పేదలకు మూడు లక్షల మేర డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామన్నారు. గ్రేటర్ మేయర్ స్థానాన్ని టీఆర్‌ఎస్ ఒంటరిగానే కైవసం చేసుకుంటుందన్నారు. రాజకీయ అనుభవం లేని లోకేశ్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.