‘ఇండియన్‌ ఐడల్‌’కు భారీ స్పందన

Playback Singer Sruthi Selected In Indian Idol 2018 - Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ఐడల్‌–2018కు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎంఎల్‌ఎన్‌ అకాడమీ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్, ఎంఎల్‌ఎన్‌ ఈవెంట్స్‌ సంయుక్తంగా అత్తాపూర్‌లో నిర్వహించిన ఆడిషన్స్‌కు భారీ స్పందన లభించింది. ఇందులో సుమారు 1800కు పైగా ఔత్సాహిక సింగర్స్‌ పాల్గొన్నారు.

నగరం నుంచి ఇండియన్‌ ఐడల్‌కు ప్లేబ్యాక్‌ సింగర్‌ శృతి ఎంపికైనట్టు నిర్వాహకులు తెలిపారు. నేహా కక్కర్, విశాల్‌ దద్లానీ, అనూమాలిక్‌ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఈ ఏడాది ‘కబర్‌ పహలే దో’ నినాదంతో జరుగుతోంది. ఈవెంట్స్‌ నిర్వహణపై యువ సింగర్స్‌ చాలా సంతోషం వ్యక్తం చేశారని ఎంఎల్‌ఎన్‌ అకాడమీ నిర్వాహకులు, ఇండియన్‌ ఐడల్‌ సౌతిండియా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎంఎస్‌రావు వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top