బ్యాలెట్‌ పేపర్‌లో అభ్యర్థుల ఫోటోలు తారుమారు | photos are exchanged in mlc ballot paper at vikarabad | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ పేపర్‌లో అభ్యర్థుల ఫోటోలు తారుమారు

Mar 9 2017 10:26 AM | Updated on Sep 3 2019 8:44 PM

ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ పేపర్‌లో తప్పులు దొర్లాయి.

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో గురువారం ఉదయం ప్రారంభమైన ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్ పేపర్‌లో తప్పులు దొర్లాయి. అభ్యర్థి లక్ష్మయ్య ఫొటో పక్కన మాణిక్ రెడ్డి పేరు ముద్రించడంతోపాటు మాణిక్‌రెడ్డి ఫొటో పక్కనే మరో అభ్యర్థి లక్ష్మయ్య పేరు ముద్రించారు.

దీంతో టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి బ్యాలెట్ పేపర్‌ను తిరిగి ముద్రించాలని డిమాండ్ చేశారు. పోలింగ్ రద్దు చేయాలని రిటర్నింగ్ అధికారిని కోరారు.ఇరువురు అభ్యర్థులు ఈ విషయమై ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ బ్యాలెట్‌లో అభ్యర్థుల ఫొటోలు మారాయన్నారు. పోలింగ్‌ కొనసాగిస్తామని, దీనిపై ఎన్నికల కమిషనకు నివేదికలు పంపుతున్నామని భన్వర్‌లాల్‌ తెలిపారు.

పోలింగ్‌ నిలిపివేయాలంటూ ముషీరాబాద్‌ పోలీంగ్‌ బూతు వద్ద ఆందోళన చేస్తున్న టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావ రవి, రాష్ట్ర కార్యదర్శి రాందాసు, రామకృష్ణ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా అరెస్టు చేసిన వారిన వెంటనే విడుదల చేయాలని, వెంటనే పోలింగ్‌ నిలిపివేయాలని వరంగల్‌ రూరల్‌ టీఎస్‌ యూటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement