పోలీసు అధికారుల పనితీరుకు రేటింగ్‌

Performance rating for police officers - Sakshi

డీజీపీ మహేందర్‌రెడ్డి

సాక్షి, మహబూబాబాద్‌/వరంగల్‌ క్రైం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో పోలీసు అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు.. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు రాష్ట్రంలో థర్డ్‌పార్టీ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. పోలీస్‌స్టేషన్లలో అందుతున్న సేవలపై ప్రజల సంతృప్తి ఆధారంగా రేటింగ్‌ ఇస్తామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం అమలవుతుందని.. ధనిక పేద, ఆడ, మగ తేడాలు లేకుండా ఒకే విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

గురువారం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూంను ప్రారంభించారు. కమిషనరేట్‌లోని పలు విభాగాలను పరిశీలించారు. జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(ఎన్‌ఐటీ)లో కమిషనరేట్‌ పరిధిలోని డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు(డీసీపీ), అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ), ఇన్‌స్పెక్టర్లు, వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. అంతకుముందు మహబూబాబాద్‌ జిల్లాలో పర్యటించారు. గుమ్ముడూరులోని సర్వేనంబరు 287లో జిల్లా పోలీసు కార్యాలయానికి కేటాయించిన స్థలాన్ని, జిల్లా పోలీసు కార్యాలయాన్ని పరిశీలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top