అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌నే కోరుకుంటున్నారు.. | People of all sections want Congress party to come to power. | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌నే కోరుకుంటున్నారు..

Dec 2 2018 11:55 AM | Updated on Dec 2 2018 11:58 AM

People of all sections want Congress party to come to power. - Sakshi

సాక్షి, మఠంపల్లి : కాంగ్రెస్‌ పార్టీతోనే గ్రామాలు, గిరిజన తండాలు అభివృద్ధి చెందుతాయని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రజలంతా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ శనివారం మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు భూక్యా మంజీనాయక్, జెడ్పీటీసీ నీలామంజీనాయక్, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యులు రాజారెడ్డి, మాజీ ఎంపీపీ టి.అప్పయ్య, నాయకులు వంటిపులి శ్రీనివాస్, స్రవంతికిషోర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సోములుగౌడ్, వెంకటేశ్వరరెడ్డి, ఆదిరెడ్డి, అచ్చమ్మ ఉన్నారు. 


ఉత్తమ్‌ గెలుపునకు ఎమ్మార్పీఎస్‌ కృషి
హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపునకు ఎమ్మార్పీఎస్‌ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ సంఘం ఇన్‌చార్జ్‌ బాలచంద్రు మాదిగ అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మార్పీఎస్‌ ఆ«ధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు  ప్రసాద్‌మాదిగ, ప్రభు, బాబుమాదిగ తదితరులున్నారు.

 
ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలి..
హుజూర్‌నగర్‌ : నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శనివారం పట్టణంలోని వివిధ వార్డులలో ప్రజాకూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బంధువులు  ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్‌ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రజాకూటమి నాయకులు పాలకూరి బా బు, రాములు, వెంకటేశ్వర్లు,  వెంకటేశ్వర్లు, మల్లీశ్వరి పాల్గొన్నారు. 


అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ వైపే..
పాలకవీడు : అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని, నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపును కోరుకుంటున్నారని కాంగ్రెస్‌ మండల సీనియర్‌ నాయకుడు భూక్యా గోపాల్‌ అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాలలో తిరుగుతూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

మండలంలోని నర్లంగులగూడెం, గుండ్లపహాడ్‌ గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన సుమారు 150 మంది ఉత్తమ్‌ సమక్షంలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌. శ్రీనివాసరెడ్డి, ఎస్‌.నాగిరెడ్డి, వల్లబురెడ్డి, జ్యోతి, సంధ్య, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.


యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ర్యాలీ
నేరేడుచర్ల : రానున్న ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ శనివారం నేరేడుచర్లలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రాజేష్, పట్టణ అధ్యక్షుడు శ్రీను, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. 
నేరేడుచర్లలో ర్యాలీ నిర్వహిస్తున్న యూత్‌ నాయకులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement