పాస్‌వర్డ్ సీక్రెట్‌గా ఉంచుకోవాలి | Password Keep Secret | Sakshi
Sakshi News home page

పాస్‌వర్డ్ సీక్రెట్‌గా ఉంచుకోవాలి

Jun 10 2014 4:01 AM | Updated on Jul 25 2019 5:24 PM

విద్యార్థులు వెబ్ అప్షన్‌లు ఎంపిక చేసుకునే క్రమంలో పాస్‌వర్డ్‌ను సీక్రెట్‌గా ఉంచుకోవాలని పాలిటెక్నిక్ హెల్ప్‌లైన్ సెంటర్ ఇన్‌చార్జ్ శంకర్ సూచించారు.

  •     పాలిటెక్నిక్ హెల్ప్‌లైన్ సెంటర్ ఇన్‌చార్జ్ శంకర్
  •      ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
  •  పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : విద్యార్థులు వెబ్ అప్షన్‌లు ఎంపిక చేసుకునే క్రమంలో పాస్‌వర్డ్‌ను సీక్రెట్‌గా ఉంచుకోవాలని పాలిటెక్నిక్ హెల్ప్‌లైన్ సెంటర్ ఇన్‌చార్జ్ శంకర్ సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సులో చేరేందుకు విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం ప్రారంభమైంది. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్, హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

    పాలిటెక్నిక్‌లో 1నుంచి 10వేల ర్యాంక్ వరకు పిలువగా 277, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 10,001 నుంచి 20వేల ర్యాంక్ వరకు పిలువగా 293 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరిశీలన అనంతరం వారికి చెక్ మెమోలు అందజేశారు. వెబ్ కౌన్సెలింగ్‌పై అవగాహన కల్పించారు.

    సర్టిఫికెట్ల పరిశీలనలో వెంకట్ నారయణ, శ్రీనివాస్, అప్పారావు, యుగంధర్‌రెడ్డి, కృష్ణ, రమేష్ కుమార్ పాల్గొన్నారు. మంగళవారం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 20,001 నుంచి 30వేల ర్యాంకు వరకు, హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 30,001 నుంచి 40వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement