పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ శాసనసభ అట్టుడికింది. మునుపెన్నడూ లేనిరీతిలో సభలో గందరగోళం రేగింది.
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ శాసనసభ అట్టుడికింది. మునుపెన్నడూ లేనిరీతిలో సభలో గందరగోళం రేగింది. ఈ ఉదయం సభ ప్రారంభంకాగానే ఈ అంశాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ సభ్యలు లేవనెత్తారు. గవర్నర్ ప్రసంగాన్ని అడుగడునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని ప్రధానంగా సభ దృష్టికి తేవాలన్న లక్ష్యంతో విపక్ష సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
గవర్నర్ ప్రసంగం కాపీలను చించేసి విసిరారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం, తోపులాటకు దిగారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, మాధవరావులను అడ్డుకునే యత్నంలో టీఆర్ఎస్ సభ్యులు వీరిని పక్కకు తోసేశారు.