
డ్రాయింగ్ మాస్టర్ సయ్యద్ హాష్మతుల్లా గీసిన ఈ చిత్రం
సాక్షి, జనగామ అర్బన్: ఓటర్లు ప్రలోభాలకు లొంగొద్దని రాజకీయ నాయకులు చేసే ఆచరణసాధ్యం కాని హామీలకు పవిత్ర ఓటును తాకట్టు పెట్టొద్దని, ప్రజాసేవ చేసే నాయకుడికే ఓటు వేయాలని ప్రజల్లో ఆలోచన రేకెత్తించే విధంగా జనగామ ప్రభుత్వ పాఠశాల (రైల్వేస్టేషన్ రోడ్డు) డ్రాయింగ్ మాస్టర్ సయ్యద్ హాష్మతుల్లా గీసిన ఈ చిత్రం పలువురిని ఆలోచింపజేస్తుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరుడి భాధ్యతే కాకుండా దానిని సరిగ్గా ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం.