మాకొద్దు.. | Sakshi
Sakshi News home page

మాకొద్దు..

Published Sat, Jan 24 2015 1:49 AM

మాకొద్దు.. - Sakshi

వన్ ప్లస్ వన్ వద్దని గుడిసెవాసుల ఆందోళన
 

నగరంలోని మురికివాడల్లో పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని,    అర్హులైన వారికి కొత్త ఇళ్లు కట్టివ్వాలని, వన్ ప్లస్ వన్ నిర్మాణాలు వద్దని వామపక్షాలు శుక్రవారం ఆందోళనకు దిగాయి. గుడిసెవాసులు  హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు నుంచి ర్యాలీగా  కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు.

వన్ ప్లస్ వన్ నిర్మాణాలు వద్దని, నగరంలో గుడిసెలు వేసుకున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించి అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ(యూ), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు ముందు హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి. నాగయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, వ్యక్తిగత ఇళ్ల నిర్మాణ పోరాట సాధన సమితి క న్వీనర్లు సిరబోయిన కరుణాకర్, దుబ్బశ్రీనివాస్, సీపీఐ నగర కార్యదర్శి వీరగంటి సదానందం, ఎంసీపీఐ(యు) నగర కార్యదర్శి మాలి బాబురావు, సీపీఎం నాయకులు మెట్టు శ్రీనివాస్, సూడికృష్ణారెడ్డి, టి.ఉప్పల్లయ్య, అక్కెనపట్లి యాదగిరి, సీపీఐ నాయకులు పోతరాజు సారయ్య, న్యూడెమోక్రసీ నాయకుడు ఆరెళ్లి కృష్ణ పాల్గొన్నారు.  - సుబేదారి
 

Advertisement

తప్పక చదవండి

Advertisement