'ఆ వీడియో దృశ్యాలను మరోసారి చూపించాలి' | Once again, the video clips on the show says janareddy | Sakshi
Sakshi News home page

'ఆ వీడియో దృశ్యాలను మరోసారి చూపించాలి'

Mar 9 2015 11:56 AM | Updated on Aug 11 2018 6:44 PM

'ఆ వీడియో దృశ్యాలను మరోసారి చూపించాలి' - Sakshi

'ఆ వీడియో దృశ్యాలను మరోసారి చూపించాలి'

సభలో జాతీయ గీతం పాడుతున్నప్పుడు అందరూ గౌరవించాలని తెలంగాణ శాసనసభాపక్ష నేత జానారెడ్డి అన్నారు.

హైదరాబాద్ : సభలో జాతీయ గీతం పాడుతున్నప్పుడు అందరూ గౌరవించాలని తెలంగాణ శాసనసభాపక్ష నేత జానారెడ్డి అన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ  గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఏర్పడిన సంఘటనలపై స్పీకర్ చూపిన క్లిప్పింగ్స్ సరిగా లేవన్నారు.  మరోసారి ఆ వీడియో దృశ్యాలను చూపించాలని జానారెడ్డి కోరారు. సభా సంప్రదాయాలను పాటించకపోవడం దురదృష్టకరమన్నారు. పోడియం వద్దకు దూసుకు వచ్చిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని జానారెడ్డి అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement