14న మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష | On 14 model schools entrance examination | Sakshi
Sakshi News home page

14న మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష

Jun 3 2015 12:37 AM | Updated on Oct 2 2018 7:58 PM

రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2015-16 విద్యా సంవత్సరానికి గాను 6వ తర గతిలో ప్రవేశాల కోసం పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2015-16 విద్యా సంవత్సరానికి గాను 6వ తర గతిలో ప్రవేశాల కోసం పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 14న ప్రవేశ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ప్రత్యేక కేటగిరీ పాఠశాలలుగా గుర్తించడంతో ప్రవేశ పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టింది. గతంలో లాటరీ ద్వారా ప్రవేశాలు చేపట్టడం వల్ల ప్రతిభావంతులకు సీట్లు రావడం లేదన్న వాదనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 177 మోడల్ స్కూళ్లలో 14,160 సీట్ల కోసం పరీక్ష నిర్వహించనున్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 50లు ఆన్‌లైన్ కేంద్రాల్లో చెల్లించాలని పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్ చిరంజీవులు తెలిపారు. ఫీజు చెల్లించాక  జ్ట్టిఞ://్ట్ఛ్చజ్చ్చఝట.ఛి జజ.జౌఠి.జీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

ఇదీ ప్రవేశాల షెడ్యూలు

ఈ నెల 2 నుంచి: ఫీజులు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణ
8వ తేదీ వరకు: ఫీజు చెల్లింపునకు చివరి గడువు
9వ తేదీ: దరఖాస్తులు సబ్మిషన్ చివరి గడువు
14వ తేదీ: ప్రవేశ పరీక్ష.(ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆయా మోడల్ స్కూల్స్/మండల కేంద్రాల్లో).
 పూర్తి వివరాలతో హాజరు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement