సూర్యాపేట - జనగాం ప్రధాన రహదారిపై మండల పరిధిలోని తిమ్మాపురం బస్ స్టేజ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధునికి గాయాలైన ఘటన సోమవారం జరిగింది.
అర్వపల్లి (నల్గొండ జిల్లా) : సూర్యాపేట - జనగాం ప్రధాన రహదారిపై మండల పరిధిలోని తిమ్మాపురం బస్ స్టేజ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధునికి గాయాలైన ఘటన సోమవారం జరిగింది. అర్వపల్లి ఎస్‌హెచ్‌ఓ డి.వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం... తిమ్మాపురం గ్రామానికి చెందిన కోడెబోయిన వెంకటయ్య అనే వృద్ధుడు సోమవారం పశువులు తోలుకొని వ్యవసాయ పొలం వద్దకు వెళ్తూ రోడ్డు దాటుతుండగా సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తాటిపాములకు వెళ్లి వస్తూ ఢీకొట్టింది. దీంతో బాధితుడిని నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.