నీటిపై సోలార్‌ ప్లాంట్‌

NTPC Ramagundam Focused On Solar System - Sakshi

ఎన్టీపీసీలో రూ.400 కోట్లతో 100 మెగావాట్ల ప్రాజెక్టు

జ్యోతినగర్‌ (రామగుండం): ఎన్టీపీసీ సంస్థ పర్యావరణ హితం దిశగా అడుగులు వేస్తోంది. 1978లో థర్మల్‌ ప్రాజెక్టుగా పురుడు పోసుకున్న ఎన్టీపీసీ రామగుండం నేడు సోలార్‌ వైపు దృష్టి సారించింది. సంప్రదాయ ఇంధన వనరుల ఉపయోగంలో భాగంగా నీటిపై తేలియాడే (ఫ్లోటిం గ్‌) సోలార్‌ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చు ట్టింది. డిసెంబర్‌లో పనులు ప్రారంభించి, ఏడాదిలో పూర్తి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ సంస్థకు నీరందించే 4 వేల ఎకరాల్లో ఉన్న రిజర్వాయర్‌లో 100 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు పనులు రూ. 400 కోట్లతో చేపడతారు.  కాగా, రామగుండం ప్రాజెక్టులోని రిజర్వాయర్‌ను బీహెచ్‌ఈఎల్‌ అధికారులు సందర్శించారు.

ఏపీ లోని సింహాద్రి ఎన్టీపీసీలో 25 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంటుతోపాటు రామగుండంలో 100 మెగావాట్ల సోలార్‌ ప్లోటింగ్, సోలార్‌ ప్లాంటు నిర్మాణ పనులను బీహెచ్‌ఈఎల్‌ సంస్థ ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) చేపట్టనుంది. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తితో ప ర్యావరణ పరిరక్షణ జరగనుంది. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తితో బొగ్గును వినియోగించడంతో కొంత మేర కాలుష్యం వెలువడుతోంది. కాగా, నీటిపై తేలియాడే సోలార్‌ ఫలకాలు బెంగళూరులో తయారు చేయనున్నారు. ఈ సోలార్‌ ప్లాంటు నిర్మాణం పూర్తయితే దేశంలోనే నీటిపై తేలియాడే అతిపెద్ద 100 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు ఉన్న ప్రాంతంగా రామగుండం రికార్డుల్లో నమోదు కానుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top