నేటి విశేషాలు..

November 6th Major Events - Sakshi

► వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో చేసిన ప్రజా సంకల్ప యాత్రకు నేటి (బుధవారం)తో సరిగ్గా రెండేళ్లు నిండాయి. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకు రావాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్‌ 6న వేసిన తొలి అడుగు.. వందలు, వేలు, లక్షలు, కోట్లాది మంది జనం మధ్య వారి హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 

► ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది.

► దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంపై  నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అంతకు ముందు విచారణ సందర్భంగా  ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

► హైదరాబాద్‌లో నేటి నుంచి లమకాన్‌లో ఉచిత ప్రదర్శనలు నిర్వహించనున్నారు. 6న రాత్రి 7 గం. లకు చిల్డ్రన్‌ ఆఫ్‌ హెవెన్‌, 7న 7.30కు- యామ్‌ ఐ యాన్‌ ఇండియా?, 8 నుంచి 11వరకు కినారా స్టూడెంట్‌ ఫిలిం ఫెస్టివల్‌--’ నిర్వహించనున్నారు. సమాజంలో అణగారిన, బలహీన పక్షాల గొంతుకను ఈ చిత్రాల ద్వారా వినిపించాలనే లక్ష్యంతో మూడు రోజుల చిత్రోత్సవాన్ని కినారా స్వచ్ఛంద సంస్థ లామకాన్‌లో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 8-11 వరకు పలు చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. 

► తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. నేడు అన్ని డిపోల వద్ద నిరహార దీక్షలకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. మరోవైపు సమ్మె చేపట్టిన ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విధించిన డెడ్‌లైన్‌ గత అర్ధరాత్రితో ముగిసింది. అయితే అర్ధరాత్రి వరకు 373 మంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top