నిర్మల్‌ జిల్లాకు జాతీయ అవార్డు  | Nirmal District Get Digital Transformation Award | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ జిల్లాకు జాతీయ అవార్డు 

Nov 7 2019 3:28 AM | Updated on Nov 7 2019 3:28 AM

Nirmal District Get Digital Transformation Award - Sakshi

నిర్మల్‌: నిర్మల్‌ జిల్లాకు జాతీయ అవార్డు దక్కింది. కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ‘డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’అవార్డును కలెక్టర్‌ ప్రశాంతి అందుకున్నారు. న్యూ ఢిల్లీలోని లలిత్‌ హోటల్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సురేష్‌ ప్రభు చేతుల మీ దుగా ఈ అవార్డును అందుకున్నారు. జిల్లాలో రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు ప్ర యోగాత్మకంగా రైతుయంత్ర యాప్‌ను అమలులోకి తీసుకువచ్చారు. ఈ యాప్‌ సక్సెస్‌తో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ విభాగంలో కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ జిల్లాకు అవార్డును అందించింది. జాతీయ స్థాయిలో జిల్లాకు అవార్డు రావడంపై కలెక్టర్‌ ప్రశాంతి హర్షం వ్యక్తం చేశారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోటేశ్వర్‌రావు, ఈడీఎం నదీమ్‌ఖాన్, డీటీ ముత్యం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement