
వారికి లక్ష చొప్పున పరిహారమివ్వండి
సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో గతేడాది ఆపరేషన్లు వికటించి చూపు కోల్పోయిన ఆరుగురికి రూ.లక్ష చొప్పున పరిహారం
వారికి పరిహారం అందజేసినట్టుగా ఆరు వారాల్లోగా తమకు ఆధారాలు కూడా అందజేయాలని శుక్రవారం పేర్కొంది. గతేడాది జూలై 4న సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 13 మందికి ఆపరేషన్ చేసిన తర్వాత కాంపౌండ్ సోడియం ల్యాక్టేట్ ఐపీ 500 ఎం.ఎల్ చుక్కల మందు ఇచ్చారు. అయితే మందులోని క్లెబ్సిల్లా బ్యాక్టీరియా కారణంగా వారిలో పలువురి చూపు దెబ్బతినగా ఆరుగురు శాశ్వతంగా చూపు కోల్పోయారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి కమిషన్ ఇప్పటికే నోటీసులిచ్చింది. తాజాగా వారికి ప్రభుత్వమే రూ.లక్ష చొప్పున పరిహారమివ్వాలని ఆదేశించింది.