ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ పోలీసులకు నోటీసులు

NHRC Issue Notice To Telangana Police On Disha Accused Encounter - Sakshi

న్యూఢిల్లీ : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై​ జాతీయ మానవహక్కులు సంఘం(ఎన్‌హెచ్‌​ఆర్‌సీ) స్పందించింది. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించింది. ఎన్‌కౌంటర్‌పై అత్యవసర దర్యాప్తునకు ఆదేశించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించడానికి తెలంగాణకు నిజనిర్ధారణ కమిటీని పంపాలని ఇన్వెష్టిగేషన్‌ డీజీని ఆదేశించింది. నలుగురు నిందితులు పోలీస్‌ కస్టడీలో ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్‌ కావడంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

కాగా, దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ను నెటిజన్లు అభినందనలతో ముంచెత్తారు. ‘సాహో సజ్జనార్‌... శభాష్‌ సజ్జనార్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

చదవండి : అందుకే కాల్పులు జరపాల్సి వచ్చింది : సజ్జనార్‌

చట్టం తన పని చేసింది, అంతా 5-10 నిమిషాల్లో

దిశ నిందితుల ఎన్కౌంటర్

దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..

మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు

దిశ నిందితుల ఎన్కౌంటర్: బుల్లెట్ దాచుకోవాలని ఉంది

దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి

పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం

దిశకు న్యాయం జరిగింది.. మరి నిర్భయ?

సాహో సజ్జనార్అంటూ ప్రశంసలు..

హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోండి

పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top