తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శం: మాయావతి

Mayawati Respond On Disha Accused Encounter - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దిశ అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అత్యాచార నిందితులకు సరైన శిక్ష వేశారని కొనియాడారు. తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎంతో నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులు దేశ పోలీసు వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. మహిళలపై దాడులను అరికట్టాలంటే  పోలీసు వ్యవస్థ ఇలాంటి చర్యలకు ఉపక్రమించక తప్పదని మాయావతి పేర్కొన్నారు.

కాగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ హత్య కేసుపై అనేక వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయిన విషయం తెలిసిందే. దిశను అత్యంత దారుణంగా అత్యాచారం జరిపి, హత్య చేసిన కామాందులకు ఉరిశిక్ష పడాలని యావద్దేశం ముక్తకంఠంతో డిమాండ్‌ చేసింది. అయితే విచారణ నిమిత్తం శుక్రవారం తెల్లవారుజామున క్రైమ్‌ సీన్‌ రికన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చిచంపారు.

చదవండి:

దిశ నిందితుల ఎన్కౌంటర్

దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..

మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top