ఆ బుల్లెట్‌ దాచుకోవాలని ఉంది: మనోజ్‌ | Manchu Manoj Welcomes Disha Case Accused Encounter | Sakshi
Sakshi News home page

ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది: మనోజ్‌

Dec 6 2019 9:17 AM | Updated on Dec 6 2019 2:14 PM

Manchu Manoj Welcomes Disha Case Accused Encounter - Sakshi

మంచు మనోజ్‌

దిశను అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితులను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ చేశారు. ఎక్కడైతే ఘాతుకానికి ఒడిగట్టారో అదే స్థలంలో నిందితులు ప్రాణాలు విడిచారు. దీనిపై టాలీవుడ్‌ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. దిశ కేసులో నిందితులు చచ్చారు అనే వార్తలో కిక్కు ఉందంటూ టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది.. తుపాకీలకు దండం పెట్టుకోవాలని ఉంది.. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది.. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు ఉందా? ఈ రోజు నీ ఆత్మ దేవుడిని చేరింది చెల్లెమ్మా’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ ఘటనపై టాలీవుడ్‌ ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మీ స్పందించారు. ఈ రోజున దిశకు అసలైన న్యాయం జరిగిందని పేర్కొన్నారు.

చదవండి:

దిశ నిందితుల ఎన్కౌంటర్

దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..

మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు

దిశ కేసు ఎన్‌కౌంటర్‌: ట్రెండింగ్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement