నర్సాపురం గ్రామంలో 200ల మందికి జ్వరాలు | Narsapuram Village in grip of Viral fevers | Sakshi
Sakshi News home page

నర్సాపురం గ్రామంలో 200ల మందికి జ్వరాలు

Aug 22 2015 3:00 PM | Updated on Sep 3 2017 7:56 AM

నల్లగొండ జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలం నర్సాపురం గ్రామంలో విష జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి.

ఆత్మకూర్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలం నర్సాపురం గ్రామంలో విష జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఇంటికి ఒకరిద్దరు చొప్పున దాదాపు 200 మంది జ్వరాల బారినపడ్డారు. ఇటీవల గ్రామంలో పీహెచ్‌సీ సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు.

అంతేకాకుండా గ్రామంలో 8 డెంగ్యూ కేసులు కూడా బయటపడ్డాయి. బాధితుల్లో ముగ్గురు కోలుకున్నప్పటికీ ఐదుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement