దౌల్తాబాద్‌లో భార్యపై హత్యాయత్నం

Murder Attempt on Wife in Doultabad - Sakshi

విచక్షణా రహితంగా కత్తితో దాడి

చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మహిళ

పోలీసుల అదుపులో నిందితుడు? 

దౌల్తాబాద్‌: కుటుంబ కలహాలతో ఓ భర్త తన భార్యను పట్టపగలు కత్తితో కిరాతకంగా దాడిచేశాడు. ఈ సంఘటన దౌల్తాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ సతీశ్‌ వివరాల ప్రకారం.. దౌల్తాబాద్‌కు చెందిన పల్లెవోని గోవిందమ్మ, తిర్మాలాపూర్‌ గ్రామానికి చెందిన నారాయణతో 18 ఏళ్ల కిందట వివాహమైంది. నారాయణ ఇల్లరికం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య విబేధాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తరచూ కలహాలు ఉన్నాయి. దీంతో 8 నెలలుగా ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. గోవిందమ్మ తల్లిగారింట్లో, నారాయణ గ్రామ సమీపాన ఉన్న పొలం వద్ద ఉన్న ఇంటిలో ఉంటున్నారు. చిన్నకుమారుడు తల్లి గోవిందమ్మ వద్ద, పెద్ద కుమారుడు తండ్రి నారాయణతో ఉంటున్నాడు. గోవిందమ్మ గ్రామంలోని కో ఆపరేటివ్‌ సొసైటీ దుకాణ సముదాయాల్లో బేకరి నిర్వహిస్తూ జీవిస్తోంది. భర్త నారాయణ కూడా ఇదే దుకాణ సముదాయాల్లో మరో షాపులో కిరాణం కొట్టు నిర్వహిస్తున్నాడు. అయితే వీరిద్దరు విడాకులు కోరుతూ, మెయింటెనెన్స్‌ కింద  కోర్టులో కేసు కూడా వేసుకున్నారు.

 పథకం ప్రకారం హత్యాయత్నం.. 
ఈ నేపథ్యంలో భార్య గోవిందమ్మపై నారాయణ కోపంగా ఉన్నాడు. ఆమెను ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంలో పథకం రచించాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం గోవిందమ్మ ఎప్పటిమాదిరిగా బేకరికి వెళ్లగా నారాయణ కూడా తన కిరాణ దుకాణానికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో బేకరికి నారాయణ మద్యంమత్తులో వచ్చాడు. గోవిందమ్మను దుకాణంలో నుంచి బయటకు లాక్కొచ్చి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనను చూసి స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించగావారిపై దాడి చేస్తానని హెచ్చరించాడు. దీంతో నారాయణ భార్య గోవిందమ్మపై కత్తితో దాడి చేశాడు. గోవిందమ్మ మృతిచెందిందని తెలుసుకుని నారాయణ బస్టాండ్‌ వైపు కత్తితో వెళ్లాడు. 

పోలీసుల అదుపులో నిందితుడు...? 
భార్యపై పట్టపగలు హత్యయత్నం చేసిన భర్త నారాయణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కుటుంబకలహాలతో భార్య ప్రవర్తన నచ్చకనే తాను హత్య చేయడానికి ప్రయత్నించానని పోలీసులకు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. విషయం తెలుసుకున్న సీఐ నాగేశ్వర్‌రావు, ఎస్‌ఐ సతీశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గోవిందమ్మ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కొన ఊపిరితో ఉన్నట్లు తెలుస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top