రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబెద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి యత్నించిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మార్పీఎస్ నాయకులు రహదారిపై బైఠాయించారు.
ఎమ్మార్పీఎస్ ధర్నా
Jan 8 2016 11:32 AM | Updated on Sep 3 2017 3:19 PM
కోదాడ: రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబెద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి యత్నించిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మార్పీఎస్ నాయకులు రహదారిపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చర్యలు తీసుకుంటాం అని హామీ ఇవ్వడంతో.. ఆందోళన విరమించారు. నల్లగొండ జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు అంబెద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి యత్నించారు. ఇది గుర్తించిన స్థానికులు ఆందోళనకు దిగారు.
Advertisement
Advertisement