ఆహార కార్డుల కోసం ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి | MRO office to Blockade for food security cards | Sakshi
Sakshi News home page

ఆహార కార్డుల కోసం ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి

Feb 16 2015 1:59 PM | Updated on Oct 2 2018 8:49 PM

ఆహార భద్రత కార్డుల కోసం గ్రామస్థులు పోరుబాట పట్టారు.

కోనరావుపేట(కరీంనగర్): ఆహార భద్రత కార్డుల కోసం గ్రామస్థులు పోరుబాట పట్టారు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల ప్రజలు సోమవారం ఉదయం ఎమ్మార్వో కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కార్యాలయానికి తాళం వేశారు. ఆహార భద్రత కార్డులు అనర్హులకే ఇస్తున్నారని, అర్హులను విస్మరిస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్డీవో రావాలని పట్టుబట్టారు. అయితే, ప్రస్తుతానికి పాత రేషన్ కార్డుల ప్రకారమే లబ్ధిదారులకు పంపిణీ జరుగుతుందని, అర్హులను తేల్చేందుకు మరోసారి విచారణ జరుపుతామని ఎమ్మార్వో నాగరాజమ్మ వారికి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement