పుట్టిన రోజు శుభాకాంక్షలు.. జగన్‌ అన్న: ఎంపీ కవిత | MP Kavitha Wishes Ys Jagan Mohanreddy | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజు శుభాకాంక్షలు.. జగన్‌ అన్న: ఎంపీ కవిత

Dec 21 2018 3:23 PM | Updated on Dec 21 2018 3:52 PM

MP Kavitha Wishes Ys Jagan Mohanreddy - Sakshi

జగన్‌ అన్న.. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలి.

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. వైఎస్‌ జగన్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కవిత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌ అన్న.. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినందకు ధన్యవాదాలు కవితమ్మ అంటూ వైఎస్‌ జగన్‌ బదులిచ్చారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌లు వైఎస్‌ జగన్‌కి ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మమతా బెనర్జీకి ధన్యవాదాలు దీదీ(సోదరి) అంటూ వైఎస్‌ జగన్‌ రిప్లై ఇచ్చారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement