కష్టపడే వారికి గుర్తింపు : ఎంపీ కవిత

MP Kavitha Said Hard Work Leaders Are Recognised In TRS Party - Sakshi

అసెంబ్లీ ఎన్నికలను మించి  పార్లమెంటు ఫలితాలు రావాలి

కేసీఆర్‌ విజన్‌తో దేశమంతా తెలంగాణవైపు చూస్తోంది

19న సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి

ఎంపీ కవితకు నాలుగు లక్షల  ఓట్ల మెజారిటీ ఖాయం

ఆకాంక్షించిన మంత్రి వేముల, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

ఆర్మూర్‌/వేల్పూర్‌: కష్టపడే వారికి టీఆర్‌ఎస్‌లో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తూ మన ఇమేజ్‌తో పాటు పార్టీ ఇమేజ్‌ను కూడా పెంచాల్సిన బాధ్యత మనపై ఉందని పార్టీ శ్రేణులకు ఎంపీ కల్వకుంట్ల కవిత దిశానిర్దేశం చేశారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసంలో, ఆర్మూర్‌లోని  ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి నివాసంలో శనివారం వేరువేరుగా జరిగిన ఆయా నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో కవిత మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మించి పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రావాలని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామాన్ని యూనిట్‌గా చేసుకొని,  ఆ దిశగా కార్యాచరణరూపొందించుకోవాలన్నారు. దేశమంతా తెలం గాణ వైపు చూస్తోందని, దీనికి మన నా యకుడు సీఎం కేసీఆర్‌ విజన్‌ కారణమన్నారు.

గొప్ప నాయకుల అడుగుజాడల్లో మనమంతా నడుస్తుం డడం మనందరికీ గర్వకారణ మన్నారు. రెండు ఎంపీలతో తెలంగాణ సాధిం చిన కేసీఆర్, 16 టీఆర్‌ఎస్, 1 ఎం ఐఎంతో కలిసి 17 పార్లమెంటు స్థానాలను గె లుచుకుంటే తె లంగాణ ప్రయోజనాలను సా ధించుకోవడం సులువవుతుందన్నా రు. ఈనెల 19న నిజామాబాద్‌లో జరిగే సీఎం కేసీఆర్‌ బహిరంగ సభను విజయవంతం చేయాల ని కోరారు. సభకు భారీగా హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రవేశపెట్టిన సం క్షేమ పథకాలు వివరిస్తూ ఎంపీ ఎన్నికల్లో  భారీ మెజార్టీ అందించే విధంగా ప్రతికార్యకర్త కృషి కోరారు. ఎన్నికల్లో ఎంపీ కవితకు నా లుగు లక్షల మె జారిటీ ఖాయమని, ప్రతి కార్యకర్త ఆ దిశగా పని చేయాలని  మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి  కోరారు. సమావేశంలో ఎ మ్మెల్సీ ఆకుల లలిత, టీఎస్‌ రెడ్కో చైర్మన్‌ ఎ స్‌ఏ అలీం, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు దాదన్నగారి విఠల్‌రావు, డాక్టర్‌ మధుశేఖర్, ఈగ గంగారెడ్డి, డి రాజారాం యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top