‘నామ్‌కే వాస్తే’గా రాష్ట్రపతి అభ్యర్థి | MP Jitendra Reddy fire on BJP | Sakshi
Sakshi News home page

‘నామ్‌కే వాస్తే’గా రాష్ట్రపతి అభ్యర్థి

Jun 22 2017 3:13 AM | Updated on Mar 29 2019 9:31 PM

‘నామ్‌కే వాస్తే’గా రాష్ట్రపతి అభ్యర్థి - Sakshi

‘నామ్‌కే వాస్తే’గా రాష్ట్రపతి అభ్యర్థి

రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ ప్రతిపా దించిన అభ్యర్థి గెలవడా నికి పూర్తి మెజారిటీ ఉన్న దని తెలిసీ.. ప్రతిపక్షాలు ‘నామ్‌కే వాస్తే’గా తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని యోచిస్తున్నాయని టీఆర్‌ ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి విమర్శించారు.

ప్రతిపక్షాలపై జితేందర్‌ రెడ్డి ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీ ప్రతిపా దించిన అభ్యర్థి గెలవడా నికి పూర్తి మెజారిటీ ఉన్న దని తెలిసీ.. ప్రతిపక్షాలు ‘నామ్‌కే వాస్తే’గా తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని యోచిస్తున్నాయని టీఆర్‌ ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్‌ నివాసానికి వెళ్లిన జితేందర్‌ రెడ్డి.. రాష్ట్రపతి పదవికి బీజేపీ ప్రతిపాదించిన రామ్‌నాథ్‌ కోవింద్‌ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ టీఆర్‌ఎస్‌ తరఫున సంబంధిత పత్రాలపై సంతకం చేశారు. 23న జరగనున్న నామి నేషన్‌ ప్రక్రియలో సీఎం కేసీఆర్‌ పాల్గొం టారన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడైన విద్యావేత్తను ఎంపిక చేయడాన్ని తమ పార్టీ స్వాగతించిందన్నారు. 30న పార్ల మెంటులో జరగనున్న జీఎస్టీ ప్రారం భోత్సవ కార్యక్రమంలో కేసీఆర్‌ పాల్గొం టారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement