అలిపిరిలో ప్రెస్‌మీట్‌: మోత్కుపల్లి | Motkupalli Narasimhulu Tomorrow Visits Tirupati | Sakshi
Sakshi News home page

చంద్రబాబుని రాజకీయంగా బొందపెట్టాలి

Jul 10 2018 4:04 PM | Updated on Aug 10 2018 9:52 PM

Motkupalli Narasimhulu Tomorrow Visits Tirupati - Sakshi

మోత్కుపల్లి నర్సింహులు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు నేడు తిరుపతి వెళ్లనున్నారు. ఈరోజు (మంగళవారం) తిరుపతికి చేరుకుని, రేపు ఉదయం తొమ్మిది గంటలకు అలిపిరి నుంచి కొండపైకి కాలి నడకన వెళ్లి దేవుడుని దర్శించుకుంటానని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వ్యతిరేక శక్తులన్ని ఏకమై ఆ దుర్మార్గుడిని రాజకీయంగా బొందపెట్టాలని ఆ దేవుడిని వేడుకుంటానని వ్యాఖ్యానించారు. దళితులు, బలహీనవర్గాలు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. దిక్కులేని వాడికి దేవుడే దిక్కని తన 64వ జన్మదినం రోజున తన మానసిక క్షోభను దేవుడికి చెప్పుకునేందుకే తిరుమల వెళ్తున్నాని తెలిపారు. రేపు ఉదయం​ అలిపిరి వద్ద మీడియాతో మాట్లాడి పాదయాత్రగా కొండపైకి చేరుకుంటానని అన్నారు. 12వ తేది మధ్యాహ్నం ఒంటిగంటకు తిరుపతిలో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి మాట్లాడుతానని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement