breaking news
tirupathi visit
-
అలిపిరిలో ప్రెస్మీట్: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు నేడు తిరుపతి వెళ్లనున్నారు. ఈరోజు (మంగళవారం) తిరుపతికి చేరుకుని, రేపు ఉదయం తొమ్మిది గంటలకు అలిపిరి నుంచి కొండపైకి కాలి నడకన వెళ్లి దేవుడుని దర్శించుకుంటానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వ్యతిరేక శక్తులన్ని ఏకమై ఆ దుర్మార్గుడిని రాజకీయంగా బొందపెట్టాలని ఆ దేవుడిని వేడుకుంటానని వ్యాఖ్యానించారు. దళితులు, బలహీనవర్గాలు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. దిక్కులేని వాడికి దేవుడే దిక్కని తన 64వ జన్మదినం రోజున తన మానసిక క్షోభను దేవుడికి చెప్పుకునేందుకే తిరుమల వెళ్తున్నాని తెలిపారు. రేపు ఉదయం అలిపిరి వద్ద మీడియాతో మాట్లాడి పాదయాత్రగా కొండపైకి చేరుకుంటానని అన్నారు. 12వ తేది మధ్యాహ్నం ఒంటిగంటకు తిరుపతిలో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతానని ప్రకటించారు. -
శ్రీవారి సేవలో సిద్దరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం ఉదయం తిరుమల శ్రీనివాసుడిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. ఇందుకోసం సోమవారం రాత్రి ఆయన తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మంటపంలో సిద్దరామయ్యను వేదపండితులు ఆశీర్వదించారు. అలయ అధికారులు లడ్డూ, ప్రసాదాన్ని కర్ణాటక సీఎంకు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సిద్దరామయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.