కన్న కొడుకులను బావిలో పడేసిన తల్లి | mother murdered children | Sakshi
Sakshi News home page

కన్న కొడుకులను బావిలో పడేసిన తల్లి

Apr 4 2015 3:26 PM | Updated on Sep 2 2017 11:51 PM

కుటుంబ కలహాలతో కన్నతల్లే తన ఇద్దరు కొడుకులను బావిలో పడేసింది. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా మాట్లూరు మండలం వెనుకీసాన్‌నగర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

నిజామాబాద్: కుటుంబ కలహాలతో కన్నతల్లే తన ఇద్దరు కొడుకులను బావిలో పడేసింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా మాట్లూరు మండలం వెనుకీసాన్‌నగర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. వెనుకీసాన్‌నగర్ గ్రామానికి చెందిన వెంకట్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు చరణ్(3), వరుణ్(2). వెంకట్ దుబాయిలో పని చేసేవాడు. కాగా నెల రోజుల క్రితమే దుబాయి నుంచి ఇంటికి వచ్చాడు. అతను వచ్చినప్పటి నుంచి కుటుంబంలో తరచు కలహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే భార్య తన ఇద్దరు కొడుకులను తీసుకెళ్లి తమ వ్యవసాయ బావిలో పడేసింది. నీటిలో మునిగి పిల్లలిద్దరూ మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పిల్లల మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement