మిషన్ ‘కాకతీయ’గా నామకరణం చేసిన చెరువుల పునరుద్ధరణకు ...
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మిషన్ ‘కాకతీయ’గా నామకరణం చేసిన చెరువుల పునరుద్ధరణకు వచ్చే వర్షాకాలం నాటికీ పూర్తి చేసేలా నీటిపారుదల శాఖ ప్రణాళిక రూపొందించింది. నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకొ ని చెరువుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఆయకట్టు విస్తీర్ణం, చెరువు సామర్థ్యం, ఫీడర్ ఛానళ్ల నిర్వహణ, చెరువుకట్ట పటిష్టత, డిస్ట్రిబ్యూటరీ ఛానళ్లను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
అంతేకాకుండా భూగర్భజలాలు దారుణంగా పడిపోయిన ప్రాంతాల్లోని చెరువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తద్వారా భూగర్భనీటి మట్టా న్ని రీచార్జి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వరద నీరు ప్రవహించేలా కాల్వలు ఉన్నా యా? వివాదరహితంగా ఉన్నాయా? అనే అంశాలను కూడా గమనంలోకి తీసుకుంటున్నారు. తొలిదశలో గుర్తించిన వాటిలో ఇప్పటివరకు 164 చెరువులకు సంబంధించిన ప్రతి పాదనలను ఇరిగేషన్ ఇంజినీర్లు తయారు చేశారు. వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందు కు చర్యలు తీసుకుంటున్నారు.
పనులు ఆలస్యం కాకుండా టెండర్ల నిర్వహణలో ప్రభుత్వం కూడా వెసులుబాటు ఇవ్వడంతో రూ.50 లక్షలలోపు పనులకు డివిజన్ స్థాయిలో ఈఈ కనుసన్నల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అపై పనులకు ఎస్‌ఈ అనుమతి త ప్పనిసరి. కాగా, పూడికతీత విషయంలో మాత్రం పరిమితి విధించింది. వంద ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న చిన్ననీటిపారుదల కమతాల్లో పూడికతీతను 30వేల క్యూబిక్ మీటర్ల వరకు, అపై విస్తీర్ణంలోని చెరువులకు 60వేల క్యూబిక్ మీటర్ల వరకు పరిమితి పెట్టింది. తద్వారా చెరువుల మరమ్మతుల్లో అక్రమాలకు అడ్డుకట్టవేయవచ్చని ప్రభుత్వం అంచనా. ఇదిలావుండగా, కేవలం సాగునీటి అవసరాలకే కాకుండా నియోజకవర్గానికో మినీ ట్యాంక్‌బండ్‌ను నిర్మించాలనే ప్రతిపాదనలనూ ఇరిగేషన్ శాఖ సిద్ధం చేస్తోంది.