ఎమ్మెల్యే పట్టించుకోరూ  జర చెప్పన్నా..? 

MLA Fires On Market Committee Members In Narayanpet - Sakshi

పెసర కొనుగోళ్ల వ్యవహారంలో కట్టుదిట్టంగా విచారించాలని అధికారులకు సూచన  

సీల్డ్‌ కవర్‌లో విచారణ నివేదికలు 

డైరెక్టర్‌ లక్ష్మీబాయి రాక 

సాక్షి, నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన పెసర కొనుగోలు కేంద్రం వ్యవహర తీరుపై జిల్లాలోని ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అ న్నదాతలకు అండగా నిలుస్తూ ప్రభుత్వం మ ద్దతు ధరను ఇచ్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పా టు చేస్తే దళారులకు దారులు వేస్తారా అంటూ మార్క్‌ఫెడ్, ఊట్కూర్‌ సింగిల్‌ విండో అధికారులతో పాటు మార్కెట్‌ యార్డు అధికారులకు జిల్లాలోని ఓ ఎమ్మెల్యే డైరెక్ట్‌గా ఫోన్‌ చేసి ఆ గ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఊట్కూర్‌ మండలంలో పెసర పంట ఏ మేరకు వేశారో తె లుసా.. ఆ మండలంలో పెసర ధాన్యం ఎంత వచ్చిందో వివరాలను పంపించాలని సదరు అధికారులకు హెచ్చరించినట్లు తెలిసింది. మీ రు తిరిగి కొనుగోలు కేంద్రం తెరిచినా దాదాపు 200 బస్తాల వరకు బోగస్‌ పెసర ధాన్యాన్ని విక్రయించేందుకు వచ్చినట్లు సమాచారం అందిందని మీరు ఏమి చేస్తున్నరంటూ అధికారులపై మండిపడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కలెక్టర్‌ సీరియస్‌గా తీసుకుని విచారణ చేపడుతున్న అధికారుల బృందంతో కట్టుదిట్టంగా చేయాలని కోరినట్లు సమాచారం.   

దళారులకు దారులు తెరిచిందెవరు? 
నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో ఊట్కూర్‌ విండో ఉండడంతో మార్కెట్‌ పాలకవర్గంలో స్థానం కల్పించారు. విండో ప్రతినిధి సభ్యుడిగా ఉండడంతో వారికి పెసర కొనుగో లు కేంద్రం నిర్వహించేందుకు ఆదేశించారు. అయితే మార్కెట్‌ పాలకవర్గంలోని ఓ బడా ప్రతినిధితో పాటు మరో డైరక్టర్‌ వారికి సంబం ధం లేకున్నా కొనుగోలు కేంద్రంలో పెత్తనం చేలాయిస్తూ రైతుల అవతారమెత్తి విక్రయించేందుకు వచ్చిన దళారులకు దారులు తెరిచినట్లు ఆరోపణలున్నాయి. మార్కెట్‌యార్డు లోని ఓ డైరెక్టర్‌ మరో డైరెక్టర్‌తో చేతులు కలి పి వారి బంధువులు, శ్రేయోభిలాషుల పేరిటా పెసరను విక్రయించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. 

వీడియో హల్‌చల్‌పై ఎమ్మెల్యేల ఆరా 
వ్యవసాయ మార్కెట్‌ యార్డు కార్యాలయంలోని ప్రతినిధి చాంబర్‌లో చోటు చేసుకున్న వ్యవహరంపై ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అయ్యింది. ఆ వీడియోలో ఏముంది.. అసలు మార్కెట్‌ యార్డులోని పెసర కొనుగోలు కేంద్రంలో ఏం అవుతుందని జిల్లాలోని ఎమ్మెల్యేలు ఆరా తీసినట్లు సమాచారం. సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో సైతం ఎమ్మెల్యేల దృష్టికి చేరింది.

మన ఎమ్మెల్యే పట్టించుకోరూ  జర చెప్పన్నా..? 
మన ఎమ్మెల్యే పట్టించుకోనేటట్లు లేరన్నా.. మీరైనా జర చెప్పండంటూ మార్కెట్‌ పాలకవర్గంలోని ఓ ప్రతినిధి మార్కెట్‌ మాజీ ప్రతినిధితో రాయబారం చేసినట్లు సమాచారం. మీరు చెబితే పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే సైతం వింటారాన్న.. మీరు ఒక్కసారి ఈ హెల్ప్‌ చేయండంటూ కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సదరు మాజీ ప్రతినిధి సైతం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఆ వ్యవహరం అంతే వదిలేయండి అంటూ సున్నితంగా తిరస్కరించినట్లు వినికిడి. పక్క ఎమ్మెల్యేకు ఈ విషయం తెలిపినా ఓ బాత్‌ చోడ్‌దేవ్‌.. దూస్‌రాబాత్‌ క్యాహై బోలో అన్నట్లు సమాచారం. పెసర కొనుగోలు కేంద్రం వ్యవహార తీరుపై ఎమ్మెల్యేలు గుర్రుమీదున్నట్లు తెలుస్తుంది. 

సీల్డ్‌ కవర్‌లో నివేదికలు 
పెసర కొనుగోలు కేంద్రంలో చోటు చేసుకున్న వ్యవహరతీరుపై కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు రెండు దఫాలుగా ఐదేసి బృందాలను నియమించి జిల్లాలోని గ్రామాల్లో విచారింపజేశారు. అయితే అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సేకరించిన నివేదికలను బృందాల వారిగా ఎవరికి వారు కలెక్టర్‌కు సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని సూచించినట్లు సమాచారం. నివేదించే వివరాలతో దళారుల గుట్టు రట్టు అవుతుందా.. విచారణ తుస్సుమంటుందో వేచి చూడాల్సిందే. 

నేడు మార్కెటింగ్‌ డైరెక్టర్‌ రాక  
రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి బుధవారం నారాయణపేటకు వస్తున్నారు. అయితే పేటలో కొనసాగుతున్న పెసర కొనుగోలు కేం ద్రం వ్యవహర తీరుపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆతర్వాత పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలిస్తారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top