ప్రముఖ హాస్యనటుడు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు మేడారం జాతరలో పోలీసుల నుంచి అవమానం ఎదురైంది.
మేడారం (వరంగల్) : ప్రముఖ హాస్యనటుడు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు మేడారం జాతరలో పోలీసుల నుంచి అవమానం ఎదురైంది. బాబూమోహన్ శుక్రవారం సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం వెళ్లగా వీఐపీలు దర్శనానికి వెళ్లే ద్వారం గేటుకు డీఎస్పీ తాళం వేసి వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా బాబూ మోహన్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులే గేటు తాళం పగులగొట్టి ఎమ్మెల్యేకు దర్శనం కల్పించారు. బాబూమోహన్ మాట్లాడుతూ.. జాతరలో పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు. ఘటనపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.