హెల్త్‌ ఎమర్జెన్సీ వచ్చినట్లుగా..ఎందుకంత రాద్ధాంతం..

Minister Talasani Srinivas Yadav Fires On Opposition Leaders - Sakshi

ప్రతిపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: వాస్తవాలు విస్మరించి.. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ వచ్చినట్లుగా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు.శుక్రవారం ఆయన సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. సీజనల్‌ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. నగరంలో వైద్యులంతా అప్రమత్తంగా ఉన్నారని...ఆదివారం కూడా వైద్యసేవలు అందిస్తున్నారని తెలిపారు. వాతావరణం మార్పుతో సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని తెలిపారు. విష జర్వాలను అదుపు చేయడానికి  వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. దేశంలోనే  బెస్ట్‌ మెడికల్‌ సేవలు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయొద్దని హితవు పలికారు. డెంగీ లేదనడం లేదని.. డెంగీని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పబ్లిసిటీ కోసం గాలి మాటలు మాట్లాడవద్దని ప్రతిపక్షాలను దుయ్యబట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top