ఆ పేషెంట్ ఘటనపై స్పందించిన కేటీఆర్‌ | minister ktr Reacts on Gandhi Hospital incident | Sakshi
Sakshi News home page

ఆ పేషెంట్ ఘటనపై స్పందించిన కేటీఆర్‌

Mar 17 2017 10:32 PM | Updated on Aug 30 2019 8:24 PM

ఆ పేషెంట్ ఘటనపై స్పందించిన కేటీఆర్‌ - Sakshi

ఆ పేషెంట్ ఘటనపై స్పందించిన కేటీఆర్‌

గాంధీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన పేషేంట్లపై సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన పేషేంట్లపై సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బొమ్మకారుతో పేషెంట్ పడిన బాధలను మీడియా ప్రతినిధులు వీడియో తీసి సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టడంతో అది కాస్తా వైరల్‌ అయింది. గాంధీ ఆస్పత్రిలో సంచలనం రేపిన ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్లో స్పందించారు. ‘గాంధీ ఆస్పత్రి సూపరిటెండెంట్‌తో ఈ ఘటనపై చర్చించాను. బాధితుడి వివరాలు అడిగి తెలుసుకున్నాను. బాధితుడు రాజుకు తన వంతు సాయం చేయడానికి సిద్ధం’  అని ట్వీట్లో పేర్కొన్నారు.

బేగంపేటకు చెందిన చెందిన రాజు (40) ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌. కొద్దిరోజుల క్రితం విద్యుతాఘాతానికి గురై రెండు కాళ్లు చచ్చుబడి నడవలేని స్థితికి చేరుకున్నాడు. నగరంలోని గాంధీ ఆస్పత్రికి వచ్చిన అతడికి చక్రాల కుర్చీ కావాలని కోరగా.. సిబ్బంది రూ.150 లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. తమ వద్ద డబ్బులు లేవని మనీ ఇచ్చుకోలేమని చెప్పడంతో సిబ్బంది నిరాకరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పేషెంట్ ను పిల్లులు ఆడుకునే బొమ్మకారుపై డాక్టర్‌ వార్డుకు తీసుకెళ్లారు. ఆస్పత్రికి వచ్చిన ప్రతిసారి చక్రాల కుర్చీ కోసం డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో.. గురువారం ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ రాజు తనతో పాటుగా చిన్నారులు ఆడుకునే బొమ్మకారు తీసుకురావడంతో సమస్యను స్పెషల్ ఫోకస్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement