70 ఏళ్లుగా కులవివక్షపై మార్పు రావడం లేదు | Minister Itala Rajinder comments on Caste discrimination | Sakshi
Sakshi News home page

70 ఏళ్లుగా కులవివక్షపై మార్పు రావడం లేదు

Jan 12 2017 3:35 AM | Updated on Sep 5 2017 1:01 AM

70 ఏళ్లుగా కులవివక్షపై మార్పు రావడం లేదు

70 ఏళ్లుగా కులవివక్షపై మార్పు రావడం లేదు

‘70 ఏళ్లుగా మనిషిని అవమానపరుస్తున్న కుల వివక్షపై మాత్రం మార్పు రావడంలేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌

సిద్దిపేట అర్బన్‌: ‘70 ఏళ్లుగా మనిషిని అవమానపరుస్తున్న కుల వివక్షపై మా త్రం మార్పు రావడంలేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సిద్దిపేట లో బుధవారం ప్రారంభమైన టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రథమ విద్యా మహాసభల్లో ఆయన పాల్గొన్నా రు. ఆయన మాట్లాడుతూ విద్య సమాజంలో భాగమని, అది అన్ని సమస్యలకు పరిష్కామని అన్నారు.  నేడది వ్యక్తిగత అవసరాలను మాత్రమే తీర్చే దిశగా సాగుతుందన్నారు. విద్య, విజ్ఞానం వ్యక్తి అవసరాల కోసం కాకుండా సమాజ అవసరాల కోసం ఉపయోగపడేలా ఉపాధ్యాయులు కృషి చేయాల న్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపె డుతున్నామన్నారు.

ప్రభుత్వమంటే ప్రైవేట్‌ చిట్‌ఫండ్‌ కంపనీ కాదని.. నిర్ణయం తీసుకుంటే తప్పకుండా అమలు చేస్తుందన్నారు. ఉపాధ్యాయులకు అడగకుం డానే 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వా నిదేన్నారు. బాధ్యతల నుంచి తప్పుకోబో మని, ఉన్నంతలో మీరు మెచ్చు కోలుగానే పనులు చేస్తం తప్ప మచ్చతెచ్చే ఏ పనీ చేయమన్నారు. రాష్ట్రం రాగానే రాత్రికి రాత్రే పేదరికం పోతుంది, సమానత్వం వస్తుంది అనుకో వడం సరికాదన్నారు. వచ్చే ఏడాదికన్నా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వవిద్యపై నమ్మ కం కలిగించేలా పనిచేయాలని ఈటల చెప్పా రు. అంతకు ముందు మహాసభల సావనీర్‌ను మంత్రి ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement